SBI Platinum Jubilee Asha Scholarship 2026 : భారత దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందచేయాలి అనే లక్ష్యంతో SBI ఫౌండేషన్ ప్రతి సంవత్సరం SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌ను అందజేస్తోంది. 2026 సంవత్సరానికి కూడా ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ పథకం ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి ఉన్నత విద్య, మెడికల్, IIT, IIM మరియు విదేశాల్లో చదివే విద్యార్థుల వరకు వివిధ విభాగాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. కోర్సును బట్టి సంవత్సరానికి ₹15,000 నుంచి అదనంగా ₹20 లక్షల వరకు నగదును పొందే అవకాశం ఉంది.
ఈ కథనంలో ప్రోత్సాహక కేటగిరీలు, అందించే మొత్తం, అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన తేదీలను వివరంగా తెలుసుకుందాం.
SBI ఆశా స్కాలర్‌షిప్ కేటగిరీలు – ఎంత మొత్తం లభిస్తుంది అనేది విశ్లేసిధం ?
SBI Foundation ఒక గొప్ప అవకాశం ఇస్తుంది విద్యార్థుల విద్యా స్థాయిని బట్టి ప్రత్యేక కేటగిరీలను ఏర్పాటు చేసింది. ప్రతి కేటగిరీకి వేర్వేరు స్కాలర్‌షిప్ మొత్తం నిర్ణయించారు.
- స్కూల్ విద్యార్థులు (9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)
దేశం లో ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న 9వ నుంచి 12వ తరగతి పిల్లలకు సంవత్సరానికి ₹15,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తుంది.
- డిగ్రీ (UG)
దేశం లో ఏదైనా NIRF Top 300 లేదా NAAC ‘A’ గ్రేడ్ ఉన్న కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న విద్యార్థులు సంవత్సరానికి ₹75,౦౦౦ రూపాయలు స్కాలర్షిప్ వరకు పొందవచ్చు దీని సహాయం తో విద్యార్థులు వాళ్ళ సంవత్సర ఫీజు సులభంగ కట్టుకోవచ్చు .
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG)
దేశం లో గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయాల్లో పీజీ చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి ₹2,50,000 రూపాయలు వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
- మెడికల్ (MBBS)
AIIMS లేదా NIRF Top 50 మెడికల్ కళాశాలలో MBBS చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి ₹4,50,౦౦౦ రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
- IIT విద్యార్థులు
భారతదేశంలోని IITల్లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం ₹2,00,000 రూపాయలు వరకు స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది.
- IIM (MBA / PGDM)
IIMల్లో MBA లేదా PGDM కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు సంవత్సరానికి ₹5,00,000 రూపాయలు వరకు పొందవచ్చు.
- విదేశీ ఉన్నత విద్య (Overseas PG)
SC/ST వర్గాలకు చెందిన విద్యార్థులు దేశ విదేశాల్లో పీజీ చదివితే సంవత్సరానికి గరిష్టంగా ₹20,00,000 రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంది.

SBI ఆశా స్కాలర్‌షిప్ 2026 అర్హతలు
ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు కింది నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది .
మొదటిగ అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలి.
గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల కనీసం 75% మార్కులు లేదా 7.0 CGPA సాధించి ఉండాలి.
SC/ST విద్యార్థులకు కనీస అర్హతలో కొంత సడలింపు ఉంటుంది.
స్కూల్ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం ₹3 లక్షల రూపాయలు మించకూడదు.
డిగ్రీ, పీజీ, MBBS, IIT, IIM విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం ₹6 లక్షల రూపాయల లోపు ఉండాలి.
అవసరమైతే రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
అవసరమైన పత్రాలు
SBI Platinum Jubilee Asha Scholarship 2026:
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
- 10వ, ఇంటర్ లేదా డిగ్రీ మార్కుల మెమోలు
- ఆధార్ కార్డు
- కాలేజ్ ఐడీ లేదా అడ్మిషన్ లెటర్
- బోనాఫైడ్ సర్టిఫికేట్
- ఫీజు రసీదు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
దరఖాస్తు ఎలా చేయాలి?
విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా సులభంగా అప్లై చేయవచ్చు.
Step 1: మొదటిగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
Step 2: కొత్త యూజర్ అయితే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది .
Step 3: మీకు సంబంధించిన స్కాలర్‌షిప్ కేటగిరీని ఎంపిక చేయండి.
Step 4: వ్యక్తిగత వివరాలు, విద్యా సమాచారం మరియు ఇతర వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
Step 5: కోరిన అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
Step 6: వివరాలను మరోసారి పరిశీలించి Final Submit పై క్లిక్ చేయండి.

విద్యార్థుల స్కాలర్షిప్కు ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
|---|---|
| దరఖాస్తుల ప్రారంభం | 22 జూలై 2026 |
| చివరి తేదీ | 4 సెప్టెంబర్ 2026 |
ముఖ్యమైన సూచనలు
- దరఖాస్తులో నమోదు చేసే వివరాలు అధికారిక పత్రాలకు సరిపోలాలి.
- తప్పు సమాచారం ఇస్తే దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంటుంది.
- ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మార్కుల మెమోలు స్పష్టంగా ఉండాలి.
- చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు SBI Platinum Jubilee Asha Scholarship 2026 మంచి అవకాశం. అర్హత ఉన్న విద్యార్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసి సంవత్సరానికి ₹15,000 నుంచి ₹20 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు.
Official Website Link:https://www.sbiashascholarship.co.in/












