ISRO Recruitment 2026: 242 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Assistant, UDC & Stenographer పోస్టులు | Apply Online | అప్లికేషన్ చివరి తేదీ ఇదే!

ISRO Recruitment 2026 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడంలో ఇస్రో సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ISRO మరో మంచి అవకాశాన్ని ప్రకటించింది. వివిధ విభాగాల్లో మొత్తం 242 ఖాళీలను భర్తీ చేయడానికి ఇస్రో సంస్థ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో…

ISRO Recruitment 2026 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడంలో ఇస్రో సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ISRO మరో మంచి అవకాశాన్ని ప్రకటించింది. వివిధ విభాగాల్లో మొత్తం 242 ఖాళీలను భర్తీ చేయడానికి ఇస్రో సంస్థ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామక ప్రక్రియలో టెక్నికల్ పోస్టులతో పాటు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి అని ఇస్రో తెలిపింది . పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ అర్హతకు తగినట్టు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే వారికి ఇది చాల మంచి అవకాశం.

మొత్తం ఖాళీలు

ఈ ఇస్రో రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 242 ఖాళీలు భర్తీ చేయవలసి ఉంటుంది. వాటి విభజన ఈ విధంగా ఉంది.
అసిస్టెంట్ పోస్టులు – 128
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 81
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – 22
స్టెనోగ్రాఫర్ – 10
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (ప్రత్యేక విభాగం) – 1

అర్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టులకు అవసరమైన విద్యార్హతను తప్పని సరిగ కలిగి ఉండాలి.
  • అసిస్టెంట్ మరియు UDC పోస్టులకు
గుర్తింపు పొందిన ఏదో ఒక విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
కంప్యూటర్ వినియోగంపై ప్రాథమిక సమాచారం ప్రయోజనం.
  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు
డిగ్రీతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం ఉండాలి.
టైపింగ్ను లేదా స్టెనో టెస్ట్‌లో ఇంగ్లీష్ అర్హత తప్పక సాధించాలి.
ఇస్రో సంస్థ అధికారిక నోటిఫికేషన్‌లో ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు తమ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి.

కనీస వయస్సు:

దరఖాస్తు సమర్పించే చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మించి ఉండకూడదు .

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటగిరీల వారి వయస్సులో సడలింపులు కూడా ఉంటాయి.

OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
PwBD అభ్యర్థులకు – ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు సడలింపు

వయస్సు లెక్కింపు ప్రకారం అధికారిక నోటిఫికేషన్‌లో ప్రతి అభ్యర్థి యొక్క తేదీ నిర్ధారణ జరుగుతుంది .

జీతభత్యాలు

ఎంపికైన ప్రతి అభ్యర్థులకు నెలకు సుమారు రూ.25,500 జీతం తో ప్రారంభ వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే వివిధ ప్రతేయక అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

అందులో ముఖ్యంగా:

డియర్‌నెస్ అలవెన్స్ (DA)
హౌస్ రెంట్‌వెన్స్ (HRA)
ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్
ఉచిత వైద్య సేవలు
పెన్షన్ మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు

అభ్యర్థి పోస్ట్ మరియు పని చేసే ప్రాంతాన్ని బట్టి మొత్తం వేతనం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం

ఈ పోస్ట్ ఉద్యోగాల ఎంపిక పలు వివిధ దశల్లో జరుగుతుంది.

మొదటిది రాత పరీక్ష
స్కిల్ టెస్ట్ లేదా స్టెనో టెస్ట్ (అవసరమైతే)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఫిట్నెస్ టెస్ట్

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశలకు పిలుస్తారు. స్కిల్ టెస్ట్ కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది అని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉండదు సో అభ్యర్థులు ప్రభుత్వ నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే బాగా అర్ధం అవుతుంది .

దరఖాస్తు విధానం

అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు చేసేటప్పుడు:

అభ్యర్థులు వ్యక్తిగత వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
విద్యార్హతల వివరాలు సరైన విధానం లో ఇవ్వాలి.
అవసరమైన ఫోటో, సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది

500 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ /ఎస్టీ , దివ్యంగులు మహిళా అభ్యర్థులు మరియు రిటైర్డ్ సర్వీస్మెన్ కు ఫీజు చెలించాల్సిన అవసరం లేదు…

చివరిగా అప్లికేషన్‌ను సమర్పించే ముందు అన్ని వివరాలను మరోసారి పరిశీలించాలి.

ముఖ్యమైన తేదీలు:


దరఖాస్తు ప్రారంభం: 16 ఆగస్టు 2026
దరఖాస్తు చివరి తేదీ: 27 ఆగస్టు 2026

చివరి రోజున వెబ్‌సైట్‌లో ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నందున ప్రతి అభ్యర్థి ముందుగానే అప్లై చేయడం మంచిది.

పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?

ISRO సంస్థ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే ప్రణాళికతో సిద్ధమవ్వాలి.

  • గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలించండి.
  • కంప్యూటర్ బేసిక్స్‌ను రివైజ్ చేయండి.
  • టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ అవసరమయ్యే పోస్టులకు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయండి.
  • అధికారిక సిలబస్‌ను అనుసరించి చదవడం ఉత్తమం.

ఎందుకు ISRO ఉద్యోగం ప్రత్యేకం?

ISROలో ఉద్యోగం పొందడం అనేది చాలా మంది యువత కల. మంచి జీతంతో పాటు ఉద్యోగ భద్రత, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదా, ప్రమోషన్ అవకాశాలు, ఆధునిక సాంకేతిక వాతావరణంలో పని చేసే అవకాశం లభిస్తుంది. దేశ అభివృద్ధికి ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్‌లకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు.

చివరి మాట

ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థులకు ISRO విడుదల చేసిన 242 పోస్టుల నోటిఫికేషన్ మంచి అవకాశం. అర్హత ఉన్నవారు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, అవసరమైన పత్రాలు వంటి వివరాలను మరోసారి పరిశీలించండి. సరైన ప్రణాళికతో సిద్ధమైతే ఈ అవకాశాన్ని విజయవంతంగా అందిపుచ్చుకోవచ్చు

About The Author

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

SureshUpdates.com

Suresh Updates ఒక తెలుగు న్యూస్ వెబ్‌సైట్.
ఇక్కడ తాజా వార్తలు, రాజకీయాలు, టెక్నాలజీ,
సినిమా మరియు క్రీడల సమాచారం అందించబడుతుంది.