తల్లికి వందనం రెండో విడత అవకాశం 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో మొదటి విడత చెల్లింపుల సమయంలో కొన్ని కుటుంబాలకు 13000 రూపాయలు ఆర్థిక సహాయం అందలేదు. సమస్యలు, డేటా లోపాలు, బ్యాంక్ ఖాతా వివరాల్లో పొరపాట్లు, పాఠశాల నమోదు సమాచారం పూర్తి కాకపోవడం వంటి కారణాలతో సాంకేతిక నిపుణుల జాబితాలో దక్కించుకోలేకపోయారు ఈ కారణంగా కొన్ని కుటుంబాలకు తల్లికి వందనం వారి బ్యాంకు కాత లోకి జమ కాలేదు .
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా Second Chance Verification చేపడుతోంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అవకాశం కల్పించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది .
ఎవరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు?
క్రింది పరిస్థితుల్లో ఉన్న ఏ కుటంబం ఐనా ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
- మొదటిగ మొదటి విడతలో డబ్బులు అందని వారు.
- అర్హత ఉన్నప్పటికీ Eligible List లో పేరు లేని వారు.
- బ్యాంక్ ఖాతా లేదా NPCI Mapping సమస్య ఉన్న వారు.
- ఆధార్ వివరాల్లో కొత్త మార్పులు చేసిన వారు.
- కొత్తగా ప్రభుత్వ లేదా పాఠశాల లేదా గుర్తింపు పొందిన ఏదయినా కొత్త విశ్వవిదాయాలం విద్యార్థుల కుటుంబాలు.
- పూర్వపు దరఖాస్తులో డేటా తప్పులు ఉన్న వారు.
కొత్తగా 1 తరగతి జాయిన్ అయ్యిన విద్యార్థులు దీనికి అర్హులు
కొత్తగ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యిన విద్యార్థులు కూడా దీనికి అర్హులు
తల్లికి వందనం సెకండ్ ఛాన్స్కు ముఖ్యమైన తేదీలు
| అంశం | తేదీ |
|---|---|
| ఫిర్యాదుల స్వీకరణ | ఆగస్టు 3 వరకు |
| ధృవీకరణ ప్రక్రియ | ఆగస్టు 4–10 |
| కొత్త అర్హుల జాబితా | ఆగస్టు 30 |
| రెండో విడత నిధుల విడుదల | ఆగస్టు 30 తర్వాత |
ఫిర్యాదు ఎలా నమోదు చేయాలి?
మీకు మొదటి సారి తల్లికి వందనం డబ్బులు రాకపోతే మీరు ఆన్‌లైన్‌లో కాకుండా ముందుగా మీరు దగ్గర లో ఉన్న లేదా మీరు ఏ గ్రామా వార్డ్ సచివాలయం లో మాపింగ్ లో ఉన్నారో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. వార్డు సచివాలయం సిబ్బందిని సంప్రదించాలి.
అక్కడ వార్డు సచివాలయంకు సంబంధిత సిబ్బందికి అవసరమైన పత్రాలు అందజేస్తే వారు మీ వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేస్తారు, దీని వాళ్ళ మీ అప్లికేషన్ ప్రభుత్వ పోర్టల్కు వెళ్తుంది దాని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కు తీస్కువెళ్తారు…

అధికారులు ఏ అంశాలను పరిశీలిస్తారు?
Verification సమయంలో కేవలం పత్రాలు మాత్రమే కాదు, ప్రభుత్వ డేటాబేస్‌లో ఉన్న సమాచారం కూడా పరిశీలిస్తారు.
వాటిలో ముఖ్యమైనవి:
- విద్యార్థి నిజంగా పాఠశాలలో చదువుతున్నాడా? లేదా అనేది నిర్ధారణ జరుగుతుంది.
- కుటుంబం ఆదాయ పరిమితిలో ఉందా? లేదా అనేది కూడా చెక్ చేస్తారు.
- ఆధార్ వివరాలు సరైనవా?
- NPCI ద్వారా బ్యాంక్ ఖాతా లింక్ అయిందా?
- ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉందా? లేదా అనేది కీలకంగ చూస్తారు..
పేరు Eligible List లో ఎప్పుడు కనిపిస్తుంది?
మీ వివరాలను Verification పూర్తైన తర్వాత అధికారులు అన్ని వివరాలను పరిశీలించి ఒక కొత్త Final Eligible List సిద్ధం చేస్తారు.
అర్హత నిర్ధారణ అయిన కుటుంబాల పేర్లు కొత్త జాబితాలో చేర్చబడతాయి. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన తేదీన వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయం జమ చేస్తుంది, ఈ నిర్ధారణ జరగడానికి కొంచెం సమయం పాడుతుంది చివరిగి ఆగష్టు ౩౦ నాటికీ మీ కాత లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది..
తల్లికి వందనం డబ్బులు రాకపోవడానికి సాధారణ కారణాలు:
చాలా సందర్భాల్లో చిన్న చిన్న కారణాల వల్ల కూడా చెల్లింపులు నిలిచిపోతాయి.
- మీ ఆధార్ కార్డు అనేది – Bank Link లేకపోవడం.
- NPCI Mapping పూర్తికాకపోవడం ఇది చాల అవసరం.
- IFSC లేదా Account Number తప్పుగా నమోదు కావడం వాళ్ళ కూడా డబ్బు జమ ఆగిపోతుంది .
- విద్యార్థి Enrollment వివరాలు Update కాకపోవడం పాత డేటా ఉండిపోవడం వాళ్ళ జరుగుతుంది.
- కుటుంబ వివరాల్లో మార్పులు నమోదు కాకపోవడం.

ఈ సారి చేయాల్సిన ముఖ్యమైన పని:
ఫిర్యాదు ఇచ్చిన వెంటనే తర్వాత అధికారులు సంప్రదించే వరకు వేచి ఉండకుండా మీరు ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంక్ ఖాతా Active గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది చాల అవసరం ఆక్టివ్ లో లేకపోతే ఆక్టివేట్ చేయించుకోండి .
అలాగే ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు సరైనవిగా ఉన్నాయో నిర్ధారించుకోవడం మంచిది. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేయాలి.
తల్లికి వందనం పథకంలో మొదటి విడతలో సహాయం అందని కుటుంబాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. అర్హత ఉన్నవారు నిర్ణయించిన గడువులోపు అవసరమైన పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదిస్తే వారి వివరాలు మళ్లీ పరిశీలించబడతాయి. ధృవీకరణ పూర్తైన తర్వాత అర్హుల జాబితాలో పేరు ఉంటే రెండో విడత చెల్లింపులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి సో దీని మీరు మంచి అవకాశంగా డబ్బు జమ కానీ వారికీ మంచి ఛాన్స్ .
మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది ప్రభుత్వ ఆఫిసిఅల్ వెబ్ సైట్ లో ఉంటుంది వాళ్ళు వెరిఫికేషన్ అయ్యేక మీకు లిస్ట్ అనేది సైట్ లో రిలీజ్ చేస్తారు ఎలా చెక్ చేసుకోవాలో మీకు అర్ధం కాక్పోతేయ్ మన వెబ్ సైట్ లో స్పష్టంగా వివరంచ బడింది ఎవరైనా చెక్ చేయాలి అంటే మన పేజీ లో ఆల్రెడీ న్యూస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది చెక్ చేయండి….
official website link:https://apseva.ap.gov.in/#/home












