చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుతుంది . నేతన్న భరోసా పథకం ఈ పథకం ద్వారా అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.25,000 వరకు ఆర్థిక సహాయం జమ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల సంక్షేమం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధిస్తుంది . ఈ నేపథ్యంలో “నేతన్న భరోసా” అనే పేరుతో నూతన ఆర్థిక సహాయ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దెశంగ భావిస్తున్నారు . ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంబించనున్నారు.
నేతన్న భరోసా పథకం పథకం అమలుకు అవసరమైన నిధుల కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సుమారు రూ.250 కోట్ల నగదు వరకు కేటాయించే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హులైన ప్రతి చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా ఆర్థిక సహాయం జమ చేసే విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది….

లబ్ధిదారుల ఎంపిక కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అర్హత ప్రమాణాలను రూపొందిస్తోంది. చేనేత వృత్తినే ప్రధాన ఉపాధిగా కొనసాగిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అవసరమైన పత్రాలను పరిశీలన అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేసి, అర్హత నిర్ధారణ పూర్తి అయ్యాక వెంటనే ఆర్థిక సహాయం విడుదల చేయనున్నట్లు సమాచారం. పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం మరియు ఇతర కీలక వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..
చేనేత భరోసా పథకం పరిధిని కేవలం చేనేత కార్మికులకే పరిమితం చేయకుండా, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా వర్తింపజేసే అవకాశాన్నిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో నూలు వడకటం, రంగులు వేయడం , వస్త్రాల తయారీకి సంబంధించిన ఇతర కార్యకలాపాల్లో ఉన్న కార్మికులను కూడా చేర్చే ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చర్య ద్వారా చేనేత రంగానికి చెందిన మరింత మంది కార్మికులకు ఆర్థిక భరోసా అందించాలనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ముఖ్యంగా పవర్‌లూమ్ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీలలో ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అదనంగా 500 యూనిట్ల వరకు తక్కువ ధరకు విద్యుత్ అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే 150 యూనిట్ల వరకు వినియోగించే వారికి ప్రత్యేక రాయితీలు అమలు చేసే అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి నిబంధనలు, అర్హతలు మరియు అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే తుది స్పష్టత రానుంది.
పథకం లక్ష్యం ఏమిటి?
ఈ పథకం అమల్లోకి వస్తే ప్రధాన లక్ష్యాలు ఇవిగా ఉండే అవకాశం ఉంది.
- చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం.
- సంప్రదాయ చేనేత వృత్తిని ప్రోత్సహించడం.
- చిన్న మరియు మధ్య తరహా చేనేత కుటుంబాలకు సహాయం అందించడం.
- చేనేత రంగంలో ఉపాధిని నిలబెట్టడం.
- గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కుటుంబాలకు మద్దతు ఇవ్వడం.
ముగింపుగా, చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకురానున్నట్లు ప్రచారంలో ఉన్న నేతన్న భరోసా పథకం అమల్లోకి వస్తే వేలాది కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే పథకానికి సంబంధించిన అర్హతలు, లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తు విధానం, అందించే ఆర్థిక సహాయం వంటి పూర్తి వివరాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత రానుంది. కాబట్టి చేనేత కార్మికులు అధికారిక ప్రకటనలనే విశ్వసిస్తూ తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించడం మంచిది….
సంప్రదించండి: పథకం వివరాలు అధికారికంగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు విధానం, అర్హతల జాబితా మరియు సహాయం పొందే ప్రక్రియను తెలియజేస్తుంది.
website link: https://bm-sgsw.ap.gov.in/BM/












