తెలంగాణ TSLPRB SI Notification 2026 విడుదల: 275 ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్ మరియు జైలర్ ఉద్యోగాల పూర్తి వివరాలు!
TSLPRB SI Notification 2026 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ మరియు ఇతర విభాగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకునే ఆసక్తి చూపే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 275 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు.
వివిధ కాళీ పోస్టుల వివరాలు:
- పోలీస్ డిపార్ట్‌మెంట్:
- సివిల్ ఎస్‌ఐ (మెన్ & విమెన్): 148
- ఏఆర్ ఎస్‌ఐ: 14
- ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ (పురుషులు): 3
- టీజీఎస్‌పీ ఎస్‌ఐ (పురుషులు): 12
- స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):
- ఎస్‌ఐ పోస్టులు: 44
- ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్:
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39
- జైళ్లు & కరెక్షనల్ సర్వీసెస్:
- డిప్యూటీ జైಲర్ (పురుషులు): 14
- డిప్యూటీ జైಲర్ (మహిళలు): 1
విద్యార్హత & వయోపరిమితి వివరాలు:
అకడమిక్ అర్హత: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం (University) నుండి ఏదైనా డిగ్రీ తప్పక పూర్తి చేసి ఉండాలి లేదా దానికి సమానమైన కోర్సు కలిగి ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీలు లేదా లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేసినా సరే, అవి యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE) లేదా సంబంధిత సంస్థలచే గుర్తింపు పొంది ఉండటం చాల తప్పనిసరి.
ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్:
పోస్ట్ జాబితాలో ఉన్న ‘స్టేషన్ ఫైర్ ఆఫీసర్’ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతో పాటు అదనంగా తప్పనిసరిగా లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం రూల్స్ ప్రకారం తప్పనిసరి ఇది లేకపోతె
మీరు వెంటనే అప్లై చేస్కోండి .
వయసు పరిమితి:
2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు దాటకూడదు, 21 – 25 మధ్యన ఉన్న వారే అర్హులు.
వయోసడలింపులు (Age Relaxation):
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కాస్ట్ కేటగిరీల వారికి మరియు ప్రభుత్వ ఉద్యోగ దారులకు వయస్సులో గరిష్టంగా 5 సంవత్సరాల వరకు సడలింపు వారికీ వర్తిస్తుంది. అలాగే మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక వయోసడలింపు అందుబాటులో ఉంటుంది.

జీతభత్యాలు, పీఎఫ్ (PF) మరియు పెన్షన్ వివరాలు:
ఎస్‌ఐ (SI) పోస్టుల వేతనం: ఎన్‌సీటీ సబ్-ఇన్‌స్పెక్టర్ అఫ్ పోలీస్ (సివిల్), ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR), ఎస్పీఎఫ్ (SPF), మరియు టీజీఎస్‌పీ (TGSP) ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వారికి ప్రారంభంలో నెలకు రూ. 42,300 నుండి గరిష్టంగా రూ. 1,15,270 వరకు వేతనం తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది.
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ & డిప్యూటీ జైలర్ పోస్టుల వేతనం:
స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ (పురుషులు మరియు మహిళలు) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 38,890 నుండి గరిష్టంగా రూ. 1,12,510 వరకు జీతభత్యాలు అందజేయబడతాయి.

పీఎఫ్ (PF) మరియు పెన్షన్ సదుపాయం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) మరియు ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS / NPS) లేదా తత్సమాన ప్రభుత్వ పెన్షన్ విధానాలు వర్తిస్తాయి. దీని ద్వారా ప్రతినెలా జీతం నుండి కొంత మొత్తం పీఎఫ్/పెన్షన్ ఖాతాకు జమ అవుతుంది ఇది వారి రిటైర్మెంట్ అయ్యాక ఉపయోగ పడుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) నిర్వహించే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రధానంగా నాలుగు దశల్లో జరుగుతుంది:
ప్రిలిమినరీ రాత పరీక్ష (Preliminary Written Test – PWT):
అభ్యర్థులకు మొట్ట మొదటగా ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్థ్‌మెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ మరియు జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్హత సాధించడానికి కేటగిరీల వారీగా కనీస మార్కులు (కటాఫ్) సాధించడం తప్పనిసరి ఇది కంప్లీట్ చేసిన వారు మాత్రమే రెండో రౌండ్కు అర్హత సాధిస్తారు .
దేహదారుఢ్య పరీక్షలు (PMT & PET):
ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET) నిర్వహించడం జరుగుతుంది.
పరుగు పందెం (Run Test): పురుష అభ్యర్థులు నిర్దేశిత సమయంలోగా (ఉదాహరణకు 1600 మీటర్లు) పరుగు పూర్తి చేయాలి, అలాగే మహిళా అభ్యర్థులు (800 మీటర్లు) నిర్దిష్ట సమయంలో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుంది.
లాంగ్ జంప్ & షాట్ పుట్: నిబంధనల ప్రకారం లాంగ్ జంప్ మరియు షాట్ పుట్ ఈవెంట్లలో అర్హత సాధించాలి.
ఎత్తు కొలతలు (Height): నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎత్తు నిర్దేశిత ప్రమాదాల మేరకు ఉండాలి.

మెయిన్స్ రాత పరీక్ష (Final Written Examination – FWE):
శారీరక దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష (మెయిన్స్) ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, తెలుగు/ఉర్దూ భాషా పత్రాలతో పాటు, అర్థ్‌మెటిక్ & రీజనింగ్ మరియు టెక్నికల్/జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించి ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
ధ్రువపత్రాల పరిశీలన & వైద్య పరీక్షలు (Certificate Verification & Medical Exam):
చివరి దశలో మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. దీనితో పాటు బోర్డు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు (Medical Tests) నిర్వహించి, అన్ని విధాలుగా ఫిట్‌గా ఉన్నవారిని తుది ఎంపిక చేసి శిక్షణకు (Training) పంపుతారు.
దరఖాస్తు తేదీలు & ముఖ్యమైన సమచారం:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: జూలై 29, 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 19, 2026
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 9, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- అధికారిక వెబ్‌సైట్: TSLPRB అధికారిక వెబ్‌సైట్ (
tslprb.inలేదాtgprb.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు వివరాలు:
- ఎస్సీ (SC) మరియు ఎస్టీ (ST) అభ్యర్థులకు: దరఖాస్తు ఫీజు రూ. 750 మాత్రమే ఉంటుంది.
- మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు: (BC, OC, EWS వంటి ఇతర అభ్యర్థులు) దరఖాస్తు ఫీజు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది.
official website link:
ముగింపు:
తెలంగాణలో పోలీస్ మరియు ఇతర విభాగాల్లో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. అర్హత, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చివరి తేదీ సెప్టెంబర్ 9, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ మరియు మరెన్నో తాజా వార్తల కోసం ఎప్పుడూ సురేశ్ అప్‌డేట్స్ (SureshUpdates.com) వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి!