
Image Source : Google
చిన్న పిల్లల్లో చాలా వరకు ఆరోగ్యకరమైన మంచి ఆహార అలవాట్లను పెంపొందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. స్కూల్స్ , వాటి పరిసర ప్రాంతాలలో చిన్నపిల్లలకు జంక్ ఫుడ్ అమ్మడం పూర్తిగా నిషేధించాలని ఆలోచిస్తున్నట్టు కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూ.టీ. ఖాదర్ మంగళూరులో వెల్లడించారు. ప్రస్తుత తరం పిల్లలు శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన పోషకాహారానికి దూరమవుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.

Image Source : Google
చిన్నపిల్లలకు జంక్ ఫుడ్‌పై నిషేధం, నిబంధనల్లో మార్పులు:
పాఠశాల విద్యార్థులకు బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ ,సాసేజ్ వంటి అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ ఆహార ఉత్పత్తులు అమ్మకుండా అడ్డుకునేడుంకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి ప్రకటన చేశారు. (Junk Food ban) చిన్నవయసులోనే పిల్లలు అనేక ఆరోగ్య సమస్యల బారిన పడటానికి ఈ జంక్ ఫుడ్ తినే అలవాట్లే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మెరుగైన ప్రమాణాలను నిర్ధారించడానికి ఆహార భద్రతా నిబంధనలలో పెద్ద ఎత్తున మార్పులను ప్రవేశపెడుతున్నామని, చిన్న పిల్లల ఎదుగుదలకు పోషక విలువలున్న మంచి ఆహారం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఆహార భద్రత మౌలిక వసతుల మరింత బలోపేతం:
ఈ జంక్ ఫుడ్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా మౌలిక వసతులను అన్నిరకాలుగా బలోపేతం చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆహార పరీక్షా ల్యాబొరేటరీలను మరింత ఆధునీకరించనున్నారు. అలాగే, టెస్టింగ్, మానిటరింగ్ సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాలో కొత్త ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఖాదర్ వివరించారు. ఈ నూతన విధానం అమలు, దాని ప్రభావంపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.












